ప్రశ్నించడానికి వస్తున్న పవన్ కల్యాణ్ !!

ఇది మరో వంచన, మరో నటన!!
ప్రశ్నించడానికి వస్తున్న అంటూ కొత్త నాటకం తో ప్ర్జాల ముందుకు వస్తున్న పవన్ కల్యాణి గారికి మా ప్రశ్న!!
ఇన్నాళ్లూ ఎక్కడికి పోయారాండీ మీరు, గత ఐదేళ్లగా ప్రజలు గుర్తుకు రాలేదా మీకు??

గత ఐదేళ్లగా ఏమి చేస్తున్నారు తమరు. ఏ పార్టీ ని తిట్టి రాజకీయాలలోకి వచ్చారో చివరికి ఆ పార్టీ లోనే మీ పార్టీ ని కలిపేసి కేంద్ర మంత్రి పదవి కోసం కక్కుర్తి పడిన మీ అన్నగారిని ఏమి ప్రశ్నిచావు నువ్వు. ఈ ఐదేళ్లుగా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ప్రభుత్వాన్ని ఒక్క ప్రశ్న అయినా అడిగావా?

chiranjeevi and Pawan
ఈ ఐదేళ్ళు నీ స్వార్ధం నువ్వు చూసుకొన్నావ్, నిన్ను నమ్మి వచ్చిన నీ వెర్రి అభిమానులని గాలికి వదిలేశావ్. పనిలో పని గా ఒక కొత్త పెళ్లి కూడా చేసుకొన్నావ్.
ఇలాంటి నీకు ఈ రోజు ఎన్నికలు ప్రకటించగానే రాజకీయలోకి మళ్లీ వచ్చే నైతిక అధికారం ఎక్కడిది?
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం YSR కుటిల రాజకీయానికి మీ వంతు సహకారం గా మీ PRP చీల్చిన వోట్ల వల్ల రాష్ట్రం లో రాక్షస పాలన పునస్థాపన జరిగింది. దోచుకొన్న వాడికి దోచుకొన్నంత అన్నట్టు అధికార పక్షం రాష్ట్రాన్ని నాశనం చేసింది. అదేమిటి అని అడగవలసిన మీ పార్టీ కాస్తా నాకు కొంచెం అంటూ వెళ్ళి వాళ్ళలోనే కలిసింది. అప్పుడు లేవని నోరు, ఈ రోజు చంద్రబాబు వైపు ప్రజలంతా ఆశగా చూస్తుంటే, ఇప్పుడు లేస్తోందే. ఏం? ఏం?
26VZVISKCITYREG2UTT_792302f
మీకు, ఆ మహానుభావుడు జయ ప్రకాష్ నారాయణ గారికిరికి ఇదే మా విన్నపం. మీ నాటకాలు కట్టి పెట్టండి. ప్రజలని వెర్రి బాగుల వాళ్ల గా చూడటం మానండి.
నిబద్దత కలిగిన నాయకుడు అంటే పదవి ఉన్న లేకపోయినా ప్రజల తరపున పోరడలి అన్న నిజాన్ని తెలుకొండి.
N-Chandrababu-at-Mahboobnager

Newswala-i-TDP-President-N-Chandrababu-Naidu-Padayatra-Mahbubnagar-2012-15
వయసుని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చంద్ర బాబు నాయుడు గారు పడ్డ కష్టాన్ని చూడండి. ఎన్నికల లో గెలవలేదు అన్న సాకుతో ఐదేళ్ళు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సరిగ్గా ఎన్నికల ముందు మళ్లీ పార్టీ అంటూ హడావిడి చేసి వోట్ల చీలిక తో కాంగ్రెస్ కే మేలు చేసే మీ విధానాలు ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోండి.
పవన్ కల్యాణ్ అభిమానులకి కూడా ఈ ప్రశ్నలు వర్తిస్థాయి. మీ సినిమా అభిమానాన్ని, కుల భావాల్ని పక్కన పెట్టి గుండెల మీద చెయ్య వేసుకొని ఈ రాష్ట్రానికి , మన భవిష్యత్తుకి నాయాయం చేసే నెయాకుడు ఎవ్వరో నిర్ణయించుకోండి. అసలే కాంగ్రెస్ పెద్దల బూటకపు నాటకం లో రాష్ట్రం రెండు ముక్కలు అయ్యింది. ఈ మిగిలిన ముక్కనయినా కాపాడుకొనే బాద్యత మన అందరిదీ. ఆలోచించుకోండి.

Leave a Reply